Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటు సాక్షిగా గోయల్ అబద్ధాలు : మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీని అధికారంలో నుంచి సాగనంపితేగానీ దేశం బాగుపడదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి మళ్లీ పాత అబద్దాలనే చెబుతున్నారని విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా కొందరు ముఖ్యమంత్రులు తనను బెదిరించారని చెప్పడం అప్రజాస్వామికమని చెప్పారు. నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని తప్పుపట్టారనీ, ఆనాడు మోడీ చేసింది బెదిరింపేనా? అని ప్రశ్నించారు. ఈమేరకు శుక్రవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తన బాధ్యత మరచి రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చంటూ చేతులెత్తేయడం రాజ్యాంగవి రుద్దమని అభిప్రాయపడ్డారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న గోయల్‌కు ఆ పదవిలో ఉండే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. కేంద్రం రాసుకున్న ఫార్మాట్లో రాష్ట్రాల నుంచి బలవంతంగా లేఖలు తీసుకుని బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చారనడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. బీజేపీ బడా కార్పొరేట్ల, బడా వ్యాపారుల పార్టీ అనీ, అందుకే రైతులు, పేద ప్రజలు ఎన్నడూ దాని ఎజెండాలో లేరని విమర్శించారు.
ఉగాది ప్రత్యేక గీతం ఆవిష్కరణ
ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ గాయని లిప్సికా భాష్యం పాడగా, విద్యాసాగర్ నాగవెల్లి సంగీతం అందించిన ప్రత్యేక గీతాన్ని నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. పాటకు భరత్ జాదవ్ దర్శకత్వం వహించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో గీత రచయిత శశికుమార్‌తోపాటు వీడియో రూపొందించిన బృందాన్ని, నటీనటులు ఇందుకుమార్, శ్రీరామ్ అబ్బూరి, సుష్మిత కోసూరిని మంత్రి అభినందించారు.