Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచన
- గతంలో 25 లక్షల మంది రిజిస్ట్రేషన్
- ఇప్పటి వరకు 20 వేల మంది వివరాలే అప్డేట్
- వరుసగా నోటిఫికేషన్ల జారీకి ప్రణాళిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రణాళిక రూపొందించామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులకు వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) తప్పనిసరిగా చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఓటీఆర్ ఉన్న అభ్యర్థులు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రాతిపదికన వివరాలను వెంటనే సవరించాలని కోరింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ఓటీఆర్ చేసుకున్న అభ్యర్థులు 25 లక్షల మంది ఉన్నారని వివరించారు. గతనెల 28వ తేదీ నుంచి ఓటీఆర్‌ను రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అప్డేట్ చేసుకోవాలంటూ సూచించామనీ, ఇప్పటి వరకు 20 వేల మంది అభ్యర్థులే వివరాలను సవరించారని తెలిపారు. అభ్యర్థులందరూ ఒకేసారి ఓటీఆర్‌ను సవరణ ప్రక్రియ చేపడితే ఇంటర్నెట్ కేంద్రాల్లో సర్వర్ తలెత్తే ప్రమాదముందని పేర్కొన్నారు. అందుకే వెంటనే ఓటీఆర్‌ను సవరించాలని సూచించారు. చివరి నిమిషంలో చేస్తే తప్పులుండే అవకాశముందనీ, సమస్యలు వస్తాయని తెలిపారు. అందుకే ఓటీఆర్‌లో తప్పుల్లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. 25 లక్షల మంది అభ్యర్థుల్లో ర్యాండమ్‌గా ఓటీఆర్‌ను సవరించుకోవాలంటూ ఈమెయిల్‌కు సమాచారం పంపిస్తున్నామని వివరించారు. అందుకే ఓటీఆర్ ప్రాధాన్యతను గుర్తించి అప్డేట్ చేసుకోవాలని సూచించారు. అది లేకుంటే టీఎస్పీఎస్సీ జారీ చేసే ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. అందుకే అభ్యర్థులు ఓటీఆర్‌ను సవరించాలని కోరారు. ఇతర వివరాలకు అభ్యర్థులు షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.