Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 1,654 మంది గెస్ట్ లెక్చరర్లకు 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఐదునెలల జీతాలు రూ.17.86 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు విడుదల చేశారు. జీతాలు విడుదల చేయడం పట్ల రాష్ట్ర గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. ఉగాది పండుగకు ఒకరోజు ముందుగా జీతాలు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డితోపాటు విద్యాశాఖ అధికారులు, తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.