Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐడి ఫ్రెష్ ఫుడ్ వెల్లడి
హైదరాబాద్ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2021-22)లో తాము ఇడ్లీ, దోస పిండితో రూ.410 కోట్ల ఆదాయాన్ని ఆర్జించామని ఐడి ఫ్రెష్ సహ వ్యవస్థాపకులు పిసి ముస్తాఫా ఓ ప్రకటనలో తెలిపారు. రూ.40 కోట్ల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న తమ సంస్థ గత సంవత్సరం దాదాపు 35 కోట్ల సంఖ్యలో ఇడ్లీలు, దోసెలకు పిండిని విక్రయించిందన్నారు. రోజుకు 65,000 కిలోల ఇడ్లీ, దోస పిండి, పరోటాలు, వడ పిండి, చపాతీ, పనీర్ వంటి ఇతర రుచికరమైన ఉత్పత్తులను 30,000 కంటే ఎక్కువ రిటైల్ అవుట్లెట్లకు అందిస్తుందన్నారు.