Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీశాట్ నెట్వర్క్ ఛానళ్ల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు క్వాంటమ్ కాన్సెప్ట్, ఉద్యోగ అవకాశాలపై రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఈవో ఆర్ శైలేష్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల నాలుగో తేదీ నుంచి 15వ తేదీ వరకు పది రోజులపాటు శిక్షణ పాఠ్యాంశాలను ప్రసారం చేస్తామని పేర్కొన్నారు. ఈనెల నాలుగు నుంచి ఎనిమిదో తేదీ వరకు, 11 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రెండుగంటలపాటు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల ద్వారా పాఠ్యాంశాలను అందిస్తామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ల శాఖ పరిధిలోని పొటానిక్స్ వ్యాలీ కార్పొరేషన్, టాస్క్, టీశాట్, ఐఐటీహెచ్, ఐఐఐటీహెచ్ సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమంలో ఐటీ దిగ్గజ సంస్థలు టీసీఐ, ఎంఫసిస్, అమేజాన్, కాపిటల్ లాజిక్, క్యూయూఎన్యూ ల్యాబ్స్ ప్రతినిధులతో క్వాంటమ్ టెక్నాలజీస్-ఎక్స్పోజర్ ట్రైనింగ్‌పై అవగాహన ప్రసారాలుంటాయని వివరించారు. దేశంలోని ప్రముఖ నగరాలైన ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రధాన కేంద్రాల నుంచి పాల్గొనే కంపెనీల ప్రతినిధుల అనుభవాలను ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులతోపాటు ఆ చదువు పూర్తయిన విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవగాహన ప్రసారాలను వినియోగించుకోవాలని సూచించారు.