Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభ్యత్వ నమోదు చేపట్టాలి
- సంస్థాగత నిర్మాణం కీలకం :చంద్రబాబు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణలో నియోజకవర్గ ఇన్చార్జీలను త్వరలో నియమిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే సభ్యత్వ నమోదుతోపాటు సంస్థాగత నిర్మాణం కూడా కీలకమని వ్యాఖ్యానించారు. శుక్రవారంహైదరాబాద్లోని తన నివాసంలో ఆ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులు , ముఖ్యనాయకులతో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బక్కని నర్సింహులు అధ్యక్షతన భేటి అయ్యారు. ఇందులో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్రెడ్డి , తెలంగాణ పార్టీ కో - ఆర్డినేటర్ కంభంపాటి రామ్మోహన్రావు హాజరయ్యారు . ఈ సందర్భంగా పార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినందుకుగా తెలంగాణ పార్టీ నేతలను అభినందించారు . ఇదే ఉత్సాహంతో మున్ముందు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామనీ, పార్టీ సంస్థాగత నిర్మాణంకోసం కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు. అన్ని పార్లమెంటరీ స్థానాల్లో రాష్ట్ర పార్టీ పర్యటించాలనీ, క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా విగ్రహావిష్కరణకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు , మహబూబాబాద్ పార్లమెంట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి రావాలని ఆ పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులు చంద్రబాబును కోరారు. ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ కమిటీలో పనిచేసిన సభ్యులతో వచ్చే వారం సమావేశమవుతానని చెప్పారు . ఈ సమావేశంలో జాతీయ పార్టీ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్న, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన , ప్రధాన కార్యదర్శులు జక్కలి ఐలయ్య యాదవ్ , తల్లూరి జీవన్ , పార్లమెంట్ అధ్యక్షులు పి . సాయిబాబా , అలి మస్కతి , నెల్లూరు దుర్గాప్రసాద్ , గూడెం సుభాష్ యాదవ్ , కె.అశోక్ గౌడ్ , ఇల్లందుల రమేష్ , కూరపాటి వెంకటేశ్వర్లు , కుందారపు కష్ణామాచారి , కొండపల్లి రామచందర్రావు , సంజరు , డి . యాదాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.