Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు షర్మిల
నవతెలంగాణ-నూతనకల్
తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలోనే కాలువలను తవ్వించారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్.షర్మిల అన్నారు. ప్రస్తుత సీఎం కేసీఆర్ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ఆరోపించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని వెంకేపల్లి, చిల్పకుంట్లలో పర్యటించి మండల కేంద్రంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. వైఎస్ఆర్ కాలంలోనే తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి చెరువుకు కాలువను తవ్వించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలన కొనసాగుతుం దన్నారు. నాడు కలలుగన్న రాజన్న రాజ్యం రావాలంటే రాజన్న బిడ్డగా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇండ్లు లేని పేదలకు ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగం వంటి సదు పాయాలను పొందాలని సూచిం చారు. వైఎస్ఆర్టీపీ తుంగ తుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఏపూరి సోమన్న మాట్లాడుతూ.. నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం తప్ప ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఎవరూ ఎమ్మెల్యేగా లేరని అన్నారు. ఇతర నియోజకవర్గాలకు చెందిన వ్యక్తులు ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండటంతో అభివృద్ధి చేయడం లేదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పట్టించు కోవడం లేదని విమర్శించారు. తాను ప్రజల మధ్య ఉంటూ నిత్యం తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని, రానున్న ఎన్నికల్లో తమకు ఓటేసి గెలిపించాలని కోరారు. గెలిచినా..ఓడినా నియో జకవర్గంలో చివరి వరకు ప్రజాసమస్యలపై పోరాడ్తానన్నారు. ఈ కార్య క్రమంలో వైఎస్ఆర్ టీపీ మండల అధ్యక్షుడు రెడ్డి నవీన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.