Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాడ్జి పై నుంచి దూకి తండ్రీకూతురు ఆత్మహత్య
- కుటుంబ కలహాలే కారణమని సూసైడ్ నోట్
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. కుటుంబ తగాదాలతో తండ్రీకూతురు ప్రయి వేటు లాడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకు న్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని లింగంపల్లి చెందిన చేరుకురి సురేష్(40), కూతురు శ్రేష్ట(6)ను తీసుకుని యాదాద్రి లకిëనరసింహస్వామి దర్శనానికి గురువారం గుట్టకు చేరుకున్నారు. శ్రీరామ్‌నగర్‌లో ఉన్న ఒక ప్రయివేటు లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున తండ్రీకూతురు లాడ్జి భవనం పై నుంచి నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతిచెందారు. బస చేసిన గదిలో సూసైడ్ నోట్ లభించింది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. తాను చనిపోతే తన కూతురు ఒంటరి అవుతుందనే భావనతోనే ఇద్దరం ఆత్మహత్య చేసుకున్నట్టు రాశాడు. సురేశ్ లింగంపల్లి బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సబ్ డివిజినల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ జానకిరెడ్డి తెలిపారు.