Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్
- 900గ్రాముల మాదక ద్రవ్యాలు,
- రూ.1,44,800 స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఇద్దరిని హైదరాబాద్ మల్కాజ్గిరి ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 900 గ్రాముల మాదక ద్రవ్యాలు, రూ.1,44,800, కారు, మూడు సెల్ఫోన్లతోపాటు వేయింట్ మిషన్లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాచకొండ సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు.
పంజాబ్‌కు చెందిన జె.సింగ్, జమిల్ సింగ్, రంజిత్ సింగ్(పరారీలోవున్నాడు) స్నేహితులు. లారీ డ్రైవర్లు పనిచేసిన వీరు సంపాదిస్తున్న దాంట్లో సంతృప్తి లేకపోవడంతో ఉపాధికోసం 12ఏండ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చారు. మేడ్చల్‌లో నివాసముంటూ కండ్లకోయలో 'పంజాబ్ డాబాను' కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలకు చెందిన లారీ డ్రైవర్లతోపాటు ఇతరులతో పరిచయాలు ఏర్పడ్డాయి. సులువుగా డబ్బులు సంపాదించేందుకు నాలుగు నెలల కిందట డ్రగ్స్‌ను సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. పంజాబ్ నుంచి తక్కువ ధరకు డ్రగ్స్‌ను డ్రైవర్లతో తెప్పించుకుని ఇక్కడ తెలిసిన వారికి, కావాల్సిన వారికి సరఫరా చేస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజ్గిరి ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ ప్రత్యేక నిఘా వేశారు. డీసీపీల ఆదేశాలతో విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో విచారించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పరారీలోవున్న రంజిత్ సింగ్ కోసం గాలిస్తున్నామని సీపీ తెలిపారు. డ్రగ్స్ ముఠాను అరెస్టు చేయడంతో పోలీసులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో డీసీపీ రక్షతామూర్తి, కె.మురళీధర్, అదనపు డీసీపీ కె.శివకుమార్, ఇన్స్పెక్టర్ ఏ.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.