Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు క్రెడారు ప్రశ్న
- సిమెంట్, స్టీల్, పీవీసీ ధరలు తగ్గించాలని డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గృహ నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలు భారీగా పెరగడంతో ఇండ్ల నిర్మాణాలు నిలిపేయాలో...వినియోగదారులకు ధరలు పెంచి అమ్ముకోవాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం చేసి చెప్పాలని క్రెడారు, దాని అనుబంధ సంస్థలు కోరాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో రవాణా ఖర్చులూ పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆఫ్ ఇండియా (క్రెడారు) దాని అనుబంధ చాప్టర్లు తెలంగాణా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా), తెలంగాణా బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్), తెలంగాణా డెవలపర్స్ అసోసియేషన్(టీడీఏ)ల సంయుక్తాధ్వర్యంలో శుక్రవారంనాడిక్కడి క్రెడారు రాష్ట్రశాఖ కార్యాలయంలో 'ముడిసరుకుల ధరల పెరుగుదల- నిర్మాణరంగంపై ప్రభావం' అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. క్రెడారు అధ్యక్షులు పీ రామకష్ణారావు, ప్రధాన కార్యదర్శి వీ రాజశేఖర్ రెడ్డి, హైదరాబాద్ శాఖ చైర్మెన్ సీహెచ్ రామచంద్రారెడ్డి, అధ్యక్షులు డీి మురళీకష్ణా రెడ్డి, తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షులు సునీల్ చంద్రారెడ్డి, ట్రెడా అధ్యక్షులు సీి ప్రభాకర్‌రావు, తెలంగాణా బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు జీవీ రావు తదితరులు మాట్లాడారు. నిర్మాణరంగంలో వినియోగించే స్టీల్, అల్యూమినియం, సిమెంట్, పీవీసీ మొదలైన వాటి ధరలు పెరగడంతో నిర్మాణ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్పుట్ వ్యయం పెరగడంతో ప్రాజెక్ట్ వ్యయం కూడా పెరుగుతున్నదనీ, ఫలితంగా రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్ల నగదు ప్రవాహానికీ, వర్కింగ్ క్యాపిటల్‌కు ఆర్ధిక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో వేగవంతమైన వద్ధి కనిపిస్తున్నదనీ, రెండేండ్ల కరోనా విపత్కర కాలంలోనూ నిలదొక్కుకోగలిగామనీ, ఇప్పుడు సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న టైంలో పెట్రోల్, డీజిల్, ముడిసరుకుల ధరల పెరుగుదల నిర్మాణరంగంలో అనిశ్చితిని సృష్టిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ పరిణామాల ప్రభావం నిర్మాణరంగంపై తీవ్రంగా పడిందన్నారు. పెరుగుతున్న ఖర్చులు భరించరాని స్థితికి చేరాయనీ, ఈ దశలో ధరలు తగ్గే వరకూ వేచి చూడడం లేదా ప్రాజెక్ట్‌లను కొనసాగించి పెరిగిన ధరలకనుగుణంగా వినియోగదారులపై భారం మోపడం మాత్రమే చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలా చేస్తే ప్రాపర్టీల ధరలు 10 నుంచి 15 శాతం పెరుగుతాయని హెచ్చరించారు. గత ఏడాది స్టీల్ ధర టన్నుకు రూ.40 వేల నుంచి రూ.45వేల వరకు ఉన్నాయనీ, ఇప్పుడు వాటి ధర రూ.85 వేల నుంచి రూ.90 వేలకు పెరిగిందని ఉదహరించారు. అల్యూమినియం ధరలు కూడా 40 నుంచి 45శాతం పెరిగాయనీ, సిమెంట్ ధరలు అదే స్థాయిలో పెరిగాయని తెలిపారు. నిర్మాణ వ్యయం పెరగడంతో ఇప్పటికే అనేక సంస్థలు నిర్మాణాలు నిలిపివేశాయని అన్నారు. దేశంలో రెండవ అతిపెద్ద ఉపాధికల్పన రియల్ ఎస్టేట్రంగంలోనే ఉన్నదనీ, దేశ స్థూల జాతీయోత్పత్తిలో అతిపెద్ద వాటాదారుగా ఉన్నదనీ వివరించారు. ప్రాజెక్టులు ఆగిపోతే దీనిపై ఆధారపడిన లక్షలాదిమంది కార్మికుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్ముడు కాకుండా ఉన్న గృహాల జాబితా కూడా ధరల పెరుగుదలపై ప్రభావం చూపిస్తున్నదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గించాలనీ, ధరలను హేతుబద్దీకరించాలనీ, రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ క్రెడిట్స్ ఇచ్చి, స్టాంప్ డ్యూటీ తగ్గించాలనీ డిమాండ్ చేశారు.