Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటీకరణను ఆపాలి :
- ఆలిండియా కాన్ఫెడరేషన్ ఎస్సీ,ఎస్టీ ఆర్గనైజేషన్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలనీ, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రయివేటీకరణ విధానాలను విడనాడాలని ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్‌రాజ్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న లైంగిక దాడులు, హత్యలు నిరోధించేందుకు వచ్చిన చట్టాన్ని అమలు చేయాలని 2018లో భారత్ బంద్‌కు పిలుపునిచ్చామని గుర్తుచేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రయివేటీకరణ విధానాల ఫలితంగా ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు హరించబడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ రంగమంతా ప్రయివేటీకరణ అయిపోతే..రాబోయే రోజుల్లో రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్ల అమలు సంగతేందో చెప్పాలన్నారు. క్రమంగా రిజర్వేషన్లకు పాలకులు ఎసరు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఒక్క ఎస్సీ, ఎస్టీల సమస్యే కాదనీ, మహిళలు, బీసీ, మైనార్టీలది కూడా అని చెప్పారు. రాబోయే కాలంలో ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరించే విధానాలకు వ్యతిరేకంగా, ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేపడతామని తెలిపారు.