Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధరల పెరుగుదలకు నిరసనగా సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని ఎంబీ భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ప్రదర్శన నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర నాయకులు పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ ఒక ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చింది.