Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో...సోమవారం భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై వారితో ఆయన చర్చిస్తారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు సీనియర్లు హాజరుకానున్నారు. ఏఐసీసీ ఇంచార్జి మాణికం ఠాగూర్ కూడా ఈ భేటీలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.