Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యుత్సాహం వద్దు : బండి సంజయ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీలో ఎన్నికలకు ముందే టికెట్లు ప్రకటించే సంస్కృతి లేదని ఆపార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ బండిసంజరు అన్నారు. కొంతమంది తమకే టికెట్ అంటూ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారనీ, ఇలాంటి అత్యుత్సాహం వద్దని నాయకులకు హితవు పలికారు. బీజేపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. ముందస్తు ప్రచారం చేసుకునే వారి పేర్లను కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోమని ఆయన స్పష్టం చేశారు.బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ జీ కూడా ఇటీవల ఇదే అంశాన్ని స్పష్టం చేశారనిఆయన గుర్తు చేశారు.తర్వలో బీజేపీలో చేరికలు పెద్దఎత్తున ఉంటాయని బండి సంజరు వెల్లడించా రు.మాజీ ఎంపీలు, కేంద్ర మాజీ మంత్రులను మాత్రమే ఢిల్లీకి తీసుకెళ్తామని అన్నారు. పెద్దపల్లి నాయకుడు గొట్టిముక్కల సురేష్ రెడ్డిని కూడా త్వరలోనే చేర్చుకుంటామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు.బూడిద భిక్షమయ్య గౌడ్ తో చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే పార్టీలో చేరుతారని బండి సంజరు తెలిపారు.