Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
- తుర్కలపల్లి గ్రామ సమీపంలో ఘటన
నవ తెలంగాణ -కల్వకుర్తి
దైవదర్శనానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలం తుర్కలపల్లి గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రానికి గౌస్ ఖన్(55) కుటుంబ సభ్యులతో కలిసి కడప పట్టణంలో ఉన్న అమీన్‌పీర్ దర్గా దర్శనానికెళ్లారు. తిరుగు ప్రయాణంలో తెల్లవారుజామున తుర్కలపల్లి గ్రామ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న సిమెంటు దిమ్మకు ఢకొీట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో గౌస్‌ఖాన్(55), అతని భార్య పరహత్(45), అతని అక్క సాధిక(58), అల్లుడు రోషన్ జమీర్(24) అక్కడికక్కడే మృతిచెందారు. గౌస్ కుమారుడు ఇంతీయజ్ తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ మనోహర్, డీఎస్పీ గిరిబాబు, సీఐ రామకృష్ణ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.