Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రహ్మశ్రీ తీగుళ్ల నరసింహ మూర్తి వ్యాఖ్య
- ఆకట్టుకున్న పంచాగ పఠనం
హైదరాబాద్ : పంచాంగ పఠనం కార్యక్రమం బ్రహ్మశ్రీ తీగుళ్ల నరసింహ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. బహస్పతి మంత్రి అవటం వల్ల ఈ ఏడాది మంచి జరిగే అవకాశం ఎక్కువ అని ఆయన తెలిపారు..వేద స్వస్తి కార్యక్రమాన్ని వేద భవనానికి చెందిన వేద పండితులు శ్రీ బదరీనాధ శర్మ ఘనాపాటి , శ్రీ. సామవేదం ఆదిత్య ఘనాపాటి నిర్వహించారు. యజుర్వేదంలో క్రమ ఘన లు పలికిన తరువాత శ్రీనివాస గద్యం తో ప్రకతిని శక్తి వంతం చేశారు. కార్యక్రమంలో రమ్య కిరణ్మయి గాత్రమందించారు.
కల్యాణి రాగంలో వర్ణంతో కచేరీ ప్రారంభించారు. తరువాత బహుళ ప్రచారం లో ఉన్న బ్రోవభారమా చాలా రమ్యంగా పాడారు.అమత వర్షిణి రాగం లో ఆనందామత వర్షిణి అనే ముత్తుస్వామి దీక్షితులు వారి రచన చాలా వినసొంపుగా పాడారు. అందులో స్వర ప్రస్తారం అందరినీ ఆకట్టుకుంది. తోడి రాగం ముఖ్య మైన అంశంగా కచేరీ ఓ రాజశేఖర్ గారి వయొలిన్ , రామకష్ణ గారి మదంగం సహకారంతో చాలా అద్భుతం గా సాగింది.ఆహుతులను ఆకట్టుకున్నది.