Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో రూ. 500 కోట్లే కేటాయింపు
- గత ఏడాదీ ఖర్చయిందీ రూ. 600 కోట్లే
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర రాజధానికి హైదరాబాద్ నగరంతోపాటు మరో నాలుగు జిల్లాలను కలుపుతూ నిర్మించత లపెట్టిన రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) భూసేకరణ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ రెండు భాగాలుగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణ భాగానికి సంబంధించిన ప్రక్రియ పూర్తయి టెండర్లు సైతం పిలిచారు. దీనికి 6,480 కోట్లు కాగా, 182 కిలోమీటర్ల మేర నిర్మితం కానుంది. అలాగే ఉత్తర భాగానికి మూడు రోజుల క్రితం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ను విడుదలచేసింది. దీనికి 158 కిలోమీటర్లకుగాను రూ.9,164కోట్లు అవసరమ వుతాయి. రెండు భాగాలు కలిపి 340 కిలోమీటర్లు. దీనికి రూ.17 వేల కోట్లు ఖర్చుచేయనున్నారు. దీనికి సంబంధించి భూసేకరణ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది.ఎనిమిది లైన్ల రింగురోడ్డు నిర్మాణానికి అయ్యే భూసేకరణ కార్యక్రమాన్ని వేగంగా చేపట్టేందుకు అవసరమయ్యే నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు. గత బడ్జెట్ కంటే కూడా ఇటీవల ప్రవెశపెట్టిన బడ్జెట్లో దాదాపు రూ.250కోట్లు తక్కువగా చూపించడమే ఇందుకు సాక్ష్యం.రాష్ట్ర ప్రభుత్వం 2022-23వార్షిక బడ్జెట్లో కేవలం రూ.500కోట్లు మాత్రమే కేటాయించింది. అయితే ఈ నిధులు ఆ ప్రాజెక్టు భూసేకరణకు ఏమాత్రం సరిపోవని ఆ శాఖా అధికారులే చెబుతు న్నారు. సుమారు రూ.1400 కోట్లు ఇటీవల బడ్జెట ్లో కేటాయిస్తే తప్ప, భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగదని అంటున్నవారూ ఉన్నారు.రీజినల్ రిండు రోడ్డు నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తుండగా, భూసేకరణకు అయ్యే ఖర్చును మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ భరించాల్సి ఉంటుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్ఆర్ఆర్కు ఇచ్చిన నిధులు భూసేకరణకు సరిపోయేలా లేవు. దీంతో ఆ ప్రక్రియ ఆలస్యం కానుంది. గతేడాది 2021-22 బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించగా, అందులో కేవలం రూ.600 కోట్లు ఖర్చుచేసినట్టు సవరించిన అంచనాల్లో సర్కారు పేర్కొంది. మిగతా రూ. 150 కోట్లను ప్రభుత్వం ఇంకా వ్యయం చేయలేదు. ఈసారి మాత్రం రూ.500 ఇచ్చినప్పటికీ, సవరించిన అంచనాల్లో నిధులను పెంచుతారా ? లేక తగ్గిస్తారా ? అనే సంగతి తేలాల్సి ఉంది. దీంతో భూసేకరణ వ్యవహారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఉత్తరభాగం సుమారు 4700 ఎకరాల భూమి అవసరమవుతుంది. దీనికోసం మొత్తం రూ.4000 కోట్లు అవసరం.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు 50 శాతం చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రూ. 2000 కోట్ల చొప్పున వ్యయం చేయాలి. గత బడ్జెట్లో చేసిన కేటాయింపులు,ఖర్చును పరిశీలి స్తే, పూర్తిస్థాయిలో వ్యయం చేసినా ఇంకో రూ.1100 కోట్లు భూసేకరణకు అవసరం కానున్నాయి. ఈ భారీ ప్రాజెక్టుకు నిధుల కొరత ఉంటే భూసేకరణ ప్రక్రియ మరో సంవత్సరం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూసేకరణ వేగంగా సాగకపోతే రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని సమాచారం. ఇప్పటికే ఈ ఉత్తరభాగం ప్రాజెక్టుకు రూ.9,164 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా,నిధులు ఆలస్యంగా ఇస్తే, ఆ వ్యయం సైతం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో నిధులు పెంచితేగానీ, భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగదన్న అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి.అయితే బడ్జెట్లో కేటాయి ంచ కపోయినా, అవసరాన్ని బట్టి ప్రభుత్వం నిధుల ను ఇస్తుందని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు.