Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముస్లిం సోదరులకు సీఎం శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మాసంలో నిష్టతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి, సౌభ్రాతృత్వం వెల్లి విరియాలని సీఎం ఆకాంక్షించారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు అల్పసంఖ్యాక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిన ఈ మాసంలో ముస్లింలందరూ ఉపవాస దీక్షల్లో ఉంటారని తెలిపారు. భక్తి ప్రవత్తులు,ఏకాగ్రత,ఆత్మను క్రమపద్ధతిలో ఉంచుకుని,నిష్ఠ, క్రమశిక్షణలతో ఉపవాస దీక్షలు కొనసాగిస్తారని పేర్కొన్నారు.
కేంద్రంలో గుడ్డి ప్రభుత్వం : మంత్రి నిరంజన్‌రెడ్డి
ప్రస్తుతం కేంద్రంలో గుడ్డి ప్రభుత్వం ఉన్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. శనివారం హైదరాబాద్ నుంచి రైతు బంధు సమితులు, రైతు నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం, రాష్ట్రం పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మోడీ సర్కారు పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.