Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బద్ధలైన 121 ఏండ్ల ఎండల రికార్డులు
హైదరాబాద్: ఏప్రిల్ ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలో మండుతున్న వేడి ప్రజల జీవనాన్ని కష్టతరం చేస్తున్నది . ఈ ఏడాది సూర్యుడు తన ప్రతాపం మార్చిలోనే చూపడం ప్రారంచాడు. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది మార్చిలో 121 ఏండ్ల రికార్డును బద్దలు కొట్టింది. 1901 తర్వాత తొలిసారిగా మార్చిలో దేశంలోని అనేక నగరాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. ఈ ఏడాది మార్చిలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 1901 నుండి సాధారణం కంటే 1.86 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంది.
ఇదే విధంగా ఎండలు మంట పుట్టిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరికొద్ది రోజుల్లో దేశంలోని 9 రాష్ట్రాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది.వాతావరణ శాఖ ప్రకారం, ఈ ఏడాది మార్చిలో సగటు పగటి ఉష్ణోగ్రత 33.01 డిగ్రీల సెల్సియస్ కాగా, 1901లో సగటు ఉష్ణోగ్రత 32.5 డిగ్రీల సెల్సియస్. ఈ ఏడాది మార్చిలో అత్యధిక ఉష్ణోగ్రతలు వాయువ్య , మధ్య భారతదేశంలో నమోదయ్యాయి. రాజధాని ఢిల్లీలో సగటు ఉష్ణోగ్రత 36.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పొడి గాలి ఇంకా కొనసాగుతోంది. రానున్న 10 రోజుల పాటు వర్షాలు లేదా తేమ కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో ఉష్ణోగ్రత మరింత పెరగవచ్చు.
వర్షపాతం కూడా సగటు కంటే 71 శాతం కంటే తక్కువ
వాతావరణ శాఖ ప్రకారం, ఈ మార్చిలో సగటున 8.9 మి.మీ వర్షం కురిసింది, ఇది దీర్ఘకాలిక సగటు (ఎల్పీఏ) 30.4 మిమీ కంటే 71 శాతం తక్కువ. అంతకుముందు, మార్చి 1909లో 7.2 మి.మీ వర్షం పడగా, 1908లో 8.7 మి.మీ. గా నమోదైంది. ఇక గత నెలలో కురిసిన వానల్ని పరిశీలిస్తే... 1901
నుంచి మూడవ అత్యల్ప వర్షపాతం నమోదైంది.
9 రాష్ట్రాల్లో హీట్ వేవ్ హెచ్చరిక
రాబోయే కొద్ది రోజుల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, తూర్పు యూపీ, ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్, విదర్భ ప్రాంతాల్లో వేడిగాలులు ఏర్పడవచ్చని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ విజ్ఞప్తి చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 4 , 8 మధ్య ఉష్ణోగ్రత 40 నుంచి 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది.
సమయానికి ముందే వేడి సెగలు?
స్కైమెట్ వెదర్ రిపోర్టుల ప్రకారం..ఉత్తర భారతదేశంలో పాశ్చాత్య డిస్ట్రబెన్స్ తక్కువ ప్రభావం కారణంగా..గాలిలో వేగం తగ్గుతుంది. అందువల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది.ఉత్తర,మధ్య భారతదేశంలో తీవ్రమై న వేడి ప్రభావం సమయానికి ముందే కనిపించింది. ఈ కారణంగా, ఈ సారి మార్చిలోనే నిరంతర పొడి , వేడి, పశ్చిమ గాలులు ఉన్నాయి.
బద్రీనాథ్ ,కేదార్నాథ్ ధామ్‌లలో మంచు అదశ్యం
ఉష్ణోగ్రతలు పెరగడంతో బద్రీనాథ్,కేదార్‌నాథ్‌లు మంచు రహితం గా మారాయి.గతేడాది వరకు4అడుగుల మేర మంచు కురిసింది. గంగోత్రి,యమునోత్రి ధామ్‌లలో గతేడాది కంటే ఎక్కువగా మంచు కురుస్తున్న సమయంలో చార్ ధామ్‌లో పరిస్థితి ఇది.మానవ వినాశనమే. .ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణమని పర్యావరణవేత్తలు అంటున్నారు.