Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శత్రువుల గుండెల్లో దడ..:
- కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్
హైదరాబాద్: వైమానిక దళంలో చేతక్ హెలికాప్టర్ సుదీర్ఘకాలంగా సేవలందిస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశ రక్షణ వ్యవస్థలో చేతక్ పేరు చెబితే శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయన్నారు. చూడటానికి చిన్నగా ఉన్నా.. చేతల్లో భయానక వాతావరణం సృష్టిస్తుందన్నారు. అనేక యుద్ధాల్లో చేతక్ ద్వారా వాయుసేనా, నౌకదళం కీలక పాత్ర పోషించాయని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో చేతక్ హెలికాప్టర్ 60ఏండ్లుగా సేవలందిస్తున్న నేపథ్యంలో హాకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఆధ్వర్యంలో నేషనల్ ఇండిస్టియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్ఐఎస్ఏ)లో వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. ఒక హెలికాప్టర్‌కు వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారంటే దాని గొప్పదనం ఏంటో తెలుస్తోందన్నారు. లక్ష్యాలను సులభంగా ఛేదించడంలో ఇది దిట్ట అని.. పలు సందర్భాల్లో విపత్తులు ఎదురైనప్పుడు చేతక్ హెలికాప్టర్ పౌరుల రక్షణకు ఎంతో ఉపయోగపడిందని వెల్లడించారు. వేడుకల్లో భాగంగా ఎన్ఐఎస్ఏ మైదానంలో పలురకాల యుద్ధ విమానాలు, చేతక్ హెలికాప్టర్ చేసిన విన్యాసాలు అబ్బుర పరిచాయి. ఈ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ తోపాటు నేవీ అధికారులు పాల్గొన్నారు.