Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని రంగాల్లోనూ సమైక్య రాష్ట్రాన్ని అధిగమించాం
- దేశానికే అన్నం పెడతాం..
- ప్రజల దీవెన, అధికారుల పనితీరుతోనే అభివృద్ధి
- అన్ని వర్గాలు బాగుంటేనే శాంతియుతంగా సమాజం: ఉగాది వేడుకల్లో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదనీ, అన్ని రంగాల్లోనూ సమైక్య రాష్ట్రాన్ని అధిగమించామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణ పురోగమించాలనీ, సామూహిక స్వప్నమైన 'బంగారు తెలంగాణ' నిజం కావాలని ఆకాంక్షించారు. ప్రజల దీవెన, అధికారుల పనితీరుతోనే రాష్ట్ర వేగంగా అభివృద్ధి
చెందుతున్నదని చెప్పారు. శుభకృత నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనీ, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. శృంగేరి పీఠం వేద పండితులు బాచంపల్లి సంపత్ కుమార్ సిద్ధాంతి పంచాంగాన్ని పఠించారు. అనంతరం వేదపండితులు, అర్చకులను సీఎం సన్మానించారు. వేదపండితులు, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పలువురు మంత్రులు సీఎం కేసీఆర్‌ను సత్కరించారు. సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే ప్రచురించిన 'మా తెలంగాణం కోటి ఎకరాల మాగాణం' పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ..75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రమూ సాధించని విజయాలను తెలంగాణ సాధించడం గర్వంగా ఉందన్నారు. కరెంటు బాధ, నీళ్ల సమస్యలు తీరిపోయాయన్నారు. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ, గత 23 జిల్లాల సమైక్య రాష్ట్రాన్ని ఎప్పుడో అధిగమించిందన్నారు. రిజర్వ్ బ్యాంకు లెక్కల్లోనూ అనేక రాష్ట్రాలను అధిగమించి ప్రగతిపథంలో పరుగెడుతున్నదని చెప్పారు. విద్యుత్, విద్య, తలసరి ఆదాయం..ఇలా అనేక విషయాల్లో అద్భుతంగా పురోగతిలో ఉందని వివరించారు. కొన్ని దుష్టశక్తులు వ్యతిరేకించినా అభివృద్ధిలో ముందుకు పోతున్నామని చెప్పారు. అనతికాలంలోనే తెలంగాణలో అద్భుత సంపద సృష్టించబడిందనీ, రాష్ట్రంలో భూముల ధరలు పెరిగాయని తెలిపారు. ఎన్నికల కోసమో, ఇంకేదాని కోసమో దళితబంధు తేలేదనీ, అది దేశానికే మార్గదర్శకం కాబోతున్నదని చెప్పారు. రాష్ట్రంలో రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర ఆదాయం ఏటా పెరుగుతూనే ఉందనీ, దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారబోతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నివర్గాలు బాగున్నప్పుడే సమాజం శాంతియుతంగా ఉంటుందన్నారు. ఆధ్యాత్మిక రంగంలో మన తెలంగాణ దేనికి తీసిపోదని సీఎం కేసీఆర్ అన్నారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతున్నాయని వివరించారు.
వార్తలు వెతుక్కోవద్దంట..పుష్కలంగా వస్తాయంట
సీఎం కేసీఆర్ అద్భుతంగా పరిపాలన కొనసాగించబోతున్నారనీ, శుభ ఫలితాలు వస్తాయని పంచాంగం వినిపించిన సంపత్‌కుమార్ సిద్ధాంతి వ్యాఖ్యానించారు. 'సీఎం కేసీఆర్ జాతకం ఇంకా బాగుంటుంది. దేశమంతా కేసీఆర్ సాహసోపేత నిర్ణ యాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీళ్లు, పచ్చని పంటలే కనిపిస్తాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. పంటలు అద్భుతం గా పండుతాయి. రైతులందరూ రాజులు కాబోతు న్నారు. ప్రభుత్వ సలహాలు, సూచనలతో పంటలేస్తే అధిక లాభాలు పొందు తారు. కరోనా వంటి చీకటి రోజులు తొలగిపోయి మంచిరోజులు రాబోతున్నా యి. ప్రజారోగ్యం భేష్. ఇది ఉద్యోగనామ సంవ త్సరం. మహిళలకు అనేక అవకాశాలొస్తాయి. వాళ్లే శాసిస్తారు. మహిళా ఐఏఎస్ అధికారులకు అద్భుతంగా ఉంది. యావత్ భారతదేశం దృష్టి హైదరాబాద్ పైనే ఉంటుంది. 75 శాతం మంచి ఫలితాలు..25 శాతం గడ్డు ఫలితాలు ఉండొచ్చు. మీడియాకు ఈ ఏడాది పుష్కలంగా వార్తలు లభిస్తా యి. జర్నలిస్టులు వార్తలకోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు'' అంటూ పంచాంగ పఠనం చేశారు.
ఆకట్టుకున్న అలంకరణలు... సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రభుత్వ సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేదికపై ఏర్పాటు చేసిన మామిడి చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉగాది పచ్చడి, భక్షాలతో పాటు పలు రకాల ప్రత్యేక వంటకాలను చేశారు. గిరిజన, ఆదీవాసీ, జానపద కళాకారులు ప్రదర్శించిన గుస్సాడీ, లంబాడీ, కొమ్ముకోయ, డప్పులు, ఒగ్గుడోలు బోనాల కోలాటం వంటి కళారూపాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం లో శానన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శానన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పార్లమెం టరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, మహ మూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జి. జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పేషన్లు, మీడియా అకాడమీ, సాహిత్య అకాడమీ చైర్మెన్లు, సీఎంఓ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికష్ణ, సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి, సీఎం ఒఎస్డీ దేశపతి శ్రీనివాస్, హైదరాబాద్ సీపీ సి.వి.ఆనంద్, పలు కార్పొరేషన్ల చైర్మెన్లు, హైదరాబాద్ మేయర్, పాల్గొన్నారు.