Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిగ్రీ కళాశాలల్లోని తెలంగాణ స్కిల్స్, నాలెడ్జ్ సెంటర్లలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఫుల్ టైం మెంటర్లను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ కాంట్రాక్ట్ ఫుల్ టైం మెంటార్స్ అసోసియేషన్ (టీజీడీసీసీఎఫ్టీఎంఏ) కోరింది. ఈ మేరకు ఆదివారం అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ పోస్టులను సూపర్ న్యూమరీ పోస్టులగా క్రియేట్ చేసి క్రమబద్దీకరించాలని విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా మార్చాలనీ, లేదా పీజీ విద్యార్హత, టెక్నికల్ అర్హత కలిగిన వారిని ప్రభుత్వ విభాగాల్లో బోధనేతర సిబ్బంది పోస్టుల్లో సర్దుబాటు చేసి రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేసింది. 14 ఏండ్లకు పైగా తమ సేవలను ప్రభుత్వానికి అందించినందుకుగాను కొత్త నియామకాల్లో వెయిటేజీ కల్పించాలని కోరింది.