Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రిపై సత్యవతి రాథోడ్ ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విషయం తెలుసుకోకుండానే మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆదివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, వాణీదేవితో కలిసి ఆమె విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్లమెంట్లో తెలంగాణలో ముతక బియ్యం ఇస్తున్నారనీ, కేంద్రం ఇస్తున్న గోధుమలు, ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఇవ్వడం లేదని అడిగారనీ, ఆయనకు తన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా తెలియదని విమర్శిం చారు.దానికి కేంద్ర మంత్రి సమాధానమిస్తూ...ఫోర్టిఫైడ్ బియ్యం, గోధుమల విషయంలో అవసరమైతే తెలంగాణ ప్రభుత్వాన్ని విచారిస్తామంటూ మంత్రి మాట్లాడటాన్ని సత్యవతి తప్పుపట్టారు. గతంలో అంగన్వాడీలను వర్కర్లు అని పిలిచేవారనీ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి టీచర్ హోదా కల్పించిందని గుర్తు చేశారు.