Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెట్టు శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ(టీఎస్ఆర్డీసీ) చైర్మెన్‌గా మెట్టు శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న రోడ్లు, భవనాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11:15 నిమిషాలకు ఛార్జి తీసుకున్నారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ పసునూరు దయాకర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, తాతా మధు, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి భాస్కర్, రాష్ట్ర మహిళా సాధికార సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వి. ప్రకాశ్ తదితరులు మెట్టు శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పదవులు అందరికి వస్తాయనీ, ఓపికతో ఉండాలని సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని జిల్లాల్లో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రహదారుల అభివృద్ధి సంస్థ (ఆర్డీసీ) చైర్మెన్‌గా బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు మెట్టు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు. సమర్థవంతంగా పనిచేసే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో అర్అండ్బీ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఎన్‌హెచ్) గణపతిరెడ్డి, ఇంజినీర్ ఇన్ చీఫ్(ఎస్ఆర్) రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.