Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్అండ్బీ సమీక్షల్లో మంత్రి వేముల
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రపంచమే అబ్బురపడేలా కొత్త సచివాలయం నిర్మాణం జరగనుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైఅంతస్థు వరకు నిర్మాణ పనులు సమాంతరంగా జరగాలనీ, సీఎం కేసీఆర్ విధించిన గడువులోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న ఆర్అండ్బీ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు.మెయిన్గ్రాండ్ ఎంట్రెన్స్, బేస్మెంట్ ఎలివేషన్, కోర్ట్ యార్డ్, జీఆర్సీ కాలమ్స్, క్లాడింగ్, కాంపౌండ్ వాల్, అర్నమెంట్ గ్రిల్, ఫాల్‌సీలింగ్, గ్రౌండ్ ఫ్లోర్ కారిడార్, గ్రానైట్ ఫోరింగ్, ఫైర్ సేఫ్టి వర్క్స్, ఎంట్రెన్స్ లాబీ, మంత్రులు, అధికారుల చాంబర్లు తదితర పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో చర్చించారు. హుస్సేన్‌సాగర్ ఒడ్డున అమరవీరుల స్థూపం అద్భుతంగా నిర్మిస్తామన్నారు. అమరుల త్యాగాలను ప్రతిబింబించేలా నిర్మాణం చేస్తామని చెప్పారు.