Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యార్థులు ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంపొందించుకుంటూ, పునశ్చరణ చేయడాన్ని మరువకూడదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని విషయాల్లోనూ అప్డేట్ కావాలనీ, లేకుంటే వెనుకబడిపోతారని చెప్పారు. గోల్కొండ పరిధిలోని తారామతి భారదరి రిసార్ట్‌లో తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021-22 కార్యక్రమం జరిగింది. దీనికి మంత్రులు, కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన వివిధ ఆవిష్కరణలను ఈ సందర్భంగా వారు పరిశీలించారు. వాటి గురించి నేరుగా విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. చిన్న పిల్లల్లో సజనాత్మకత అధికంగా ఉంటుందనీ, చాలా ప్రయోగాలు చేస్తుంటారని చెప్పారు. తాను బాల్య అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. జపాన్ పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందంటూ తన పర్యటన అనుభవాలు చెప్పారు. ప్రస్తుత జనరేషన్ పిల్లలకు బియ్యం, పాలు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియట్లేదని అన్నారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు వారిని డాక్టర్, ఇంజినీర్ అవుతావా? అని అడిగి మూస ధోరణిలో వెళ్లడం మానేయాలని చెప్పారు. పిల్లల్లో సహజంగా ఉండే తెలివికి పదును పెడితే.. వారు ఒకరి దగ్గర పనిచేయడం కాదనీ, వారే వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు సృష్టిస్తారని అభిలషించారు. కొత్తగా రూ.6 కోట్ల వ్యయంతో యూత్ హబ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.
ఇంధóన ధరలు 30 శాతం తగ్గించొచ్చు : ట్విట్లర్లో మంత్రి కేటీఆర్
పెట్రో ధరల పెంపు, సెస్‌లు, క్రూడాయిల్ ధరలు తగ్గించడానికి పార్లమెంటులో చర్చించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించారు. తాను చైనీస్ టార్చర్ గురించి పుస్తకాల్లో మాత్రమే చదివాననీ, కానీ కేంద్ర ప్రభుత్వం వరుసగా 14 రోజుల్లో 12 సార్లు లీటర్‌కు 80 పైసల చొప్పున పెట్రోల్ ధరలు పెంచి అన్ని రకాల టార్చర్లను తిరగరాసి కొత్త రికార్డు సష్టించదని విమర్శించారు. రాష్ట్రంలో తాము ఏడేండ్లుగా వ్యాట్‌ను పెంచలేదని గుర్తుచేశారు.