Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెంగాణ-హైదరాబాద్
ఏ తల్లి కన్న బిడ్డో, ఏం జరిగిందో కానీ పసికందును ప్లాస్టిక్ కవర్లో చుట్టి హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రి వద్ద వదిలేశారు. ఈ ఘటన సోమవారం కలకలం రేపింది. మూడు నాలుగురోజుల వయసు కూడా దాటని పసిబిడ్డను చూసి స్థానికులు వెంటనే డాక్టర్లకు, పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి అక్కడ వదిలేసి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. శిశువుకు చికిత్స అందించిన డాక్టర్లు అంగవైకల్యం, కామెర్లు ఉన్నట్టు గుర్తించారు. అంగవైకల్యం ఉండటం వల్లే వదిలేసి వెళ్లారా? మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆస్పత్రి పరిధిలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.