Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజేఎస్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండరామ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
తమ సమస్యలు పరిష్కరించాలని నిమ్స్ ఆస్పత్రిలో నర్సులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం, యాజమాన్యం ఎందుకు స్పందించడం లేదని టీజేఎస్ వ్యవస్థాపకులు కోదండరామ్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిస్తున్న గర్భిణీ నర్సులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారికి మద్దతుగా కోదండరామ్ మాట్లాడుతూ.. గత నెల 20వ తేదీ నుంచి తమ సమస్యలపై ఏదో ఒకరూపంలో నర్సులు నిరసన తెలుపుతున్నారని చెప్పారు. వారికి మెటర్నిటీ లీవు, సమాన సనికి సమాన వేతనం అందడం లేదన్నారు. గర్భిణులు నిరసనల్లో పాల్గొంటున్నా స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ బేసిక్ పే ఇక్కడ పనిచేసే కాంట్రాక్టు నర్సులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నిమ్స్ అటానమస్ పరిధిలో ఉందని యాజమాన్యం తప్పించుకో చూస్తోందని, అలాంటప్పుడు అటానమస్ పరిధిలో ఉన్న వివిధ సంస్థల ప్రకారం వేతనం చెల్లించడానికి గల ఇబ్బందులేమిటని ప్రశ్నించారు. కరోనా సమయంలో కూడా 8 నెలలు విధులు నిర్వహించిన వారికి మూడు నెలల జీతాలు ఇవ్వలేదన్నారు. ప్రసూతి సెలవులు ఆరు నెలలు ఇవ్వాల్సి ఉండగా.. ఇవ్వడం లేదని, ఎవరైనా సెలవు తీసుకుంటే వేతనం కట్ చేస్తున్నారని, ఇది సరైంది కాదని అన్నారు. నర్సుల సమస్యలు పరిష్కరించకుంటే పెద్దఎత్తున పోరాడతామని చెప్పారు.