Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
డ్రగ్స్, గంజాయి మత్తులో ఊగుతున్నది జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాయకుల పిల్లలే అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. సోమవారంనాడాయన తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లోని ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో పట్టుబడిన పిల్లలంతా ఆపార్టీ వాళ్లేననీ, పోలీసు రికార్డులు దీన్ని ధృవీకరిస్తున్నాయనీ చెప్పారు. పబ్ నిర్వాహకులు బీజేపీ నాయకురాలు ఉప్పల శారద కుమారుడు అభిషేక్ ఉప్పల అని తేలిందన్నారు. ఉప్పల శారద 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేశారనీ, అభిషేక్ బీజేపీ కండువా కప్పుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారంటూ అందుకు సంబంధించిన ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. పోలీసులు విడుదల చేసిన జాబితాలో 24వ పేరు సూదిని ప్రణరు రెడ్డిది ఉందనీ, ఆయన యూత్‌కాంగ్రెస్ లీడర్కూడా అనీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మేనల్లుడు అని చెప్పారు. ఇప్పుడు ఎవర్ని ఉరితీయాలో...ఎవర్ని షూట్ చేయాలో ఆరెండు పార్టీల అధినేతలే చెప్పాలని డిమాండ్ చేశారు.