Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యాన్ని కేంద్రమే కొనాలి : జూలకంటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిర్మాణ రంగానికి చెందని స్టీల్, సిమెంట్ ధరలను విపరీతంగా పెంచి మధ్యతరగతి ప్రజానికంపై మోయలేని భారాలను వేసిందని విమర్శించారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ పీజులు పెంచి మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా ప్రజలపై మరింత భారాలు మోపిందని తెలిపారు. గత రెండేండ్లుగా ప్రజలకు ఉపాధి లేక, కుటుంబాలు గడవక తీవ్ర కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. వీరిపై అమానవీయంగా ధరలు పెంచటం దుర్మార్గమని పేర్కొన్నారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటూ రైతులను విస్మరిస్తున్నారని తెలిపారు.