Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కరెంటు ఛార్జీలను పెంపును నిరసిస్తూ ఈనెల ఆరున నియోజవర్గ కేంద్రాల్లో ఆందోళన చేపట్టనున్నట్టు తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు బక్కని నర్సింహులు తెలిపారు.కరోనా సృష్టించిన కల్లోలం నుంచి బయటపడక ముందే పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచి కేంద్రం,ఉద్యోగాలు పోయి ఇబ్బందులు పడుతున్న తరు ణంలో కరెంటు ఛార్జీలతో రాష్ట్రం పేదలపైదాడి చేయడం అన్యాయమ ని అన్నారు.రవాణా ఛార్జీలతోపాటు నిత్యావసరాల ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలతో ప్రజలపై రూ.5,600 కోట్ల భారం మోపారని అన్నారు.బీజేపీ 15రోజుల్లో 12సార్లు పెట్రోల్,డీజిల్ ధరలు పెంచడాన్ని ఖండించారు. ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ యాసంగి వరి ధాన్యం కొనుగోలు వియంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు.ధాన్య ం కొనుగోలు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకోవడం దారుణమని అన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని ఎన్టీఆర్భవన్లో మీడియాతో మాట్లాడారు.