Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నదుల హక్కుల కాపాడే ప్రయత్నం చేస్తానని హామీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ జల వనరుల అభివద్ధి సంస్థ చైర్మెన్ వి ప్రకాశ్ పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కార్పొరేషన్ చైర్మెన్‌గా ప్రకాశ్ కొనసాగుతారని తెలిపింది. ఈ మేరకు ఆయన పదవీకాలం పొడిగిస్తూ జీవో నెంబరు 124ను విడుదల చేస్తూ నీటిపారుదల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేండ్లుగా సంస్ధ చైర్మెన్‌గా ఆయన కొనసాగుతున్నారు. 2017లో జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌గా ప్రకాశ్ నియామకమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 'నవతెలంగాణ'తో మాట్లాడుతూ రాష్ట్రంలో జలవనరుల పెంపుతోపాటు నదుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్‌తో కలిసి హైదరాబాద్‌లో ఇటీవల నదుల రక్షణ కోసం అంతర్జాతీయ సెమినార్లు నిర్వహించినట్టు చెప్పారు. మానవులతోపాటు నదులకూ హక్కులు ఉంటాయనీ, వాటి పరిరక్షణకు కృషిచేస్తానని వివరించారు.