Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు ఈనెలలో హైదరాబాద్లో నిర్వహించనున్నట్టు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ తెలిపారు.రెండు రోజులపాటు జరిగే శిక్షణా తరగతులలో పాల్గొనదలచినవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. సోమవారం అకాడమీలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లోని మహిళా జర్నలిస్టులు మీడియా అకాడమి మేనేజర్ ఏ.వనజ (సెల్ నె.7702526489)తోపాటు జిల్లాలలో పనిచేసేవారు ఆయా జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలని కోరారు. మొదటిరోజు రాష్ట్ర మహిళా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు శాసనసభ్యులు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొంటారని చెప్పారు. రెండవ రోజు జాతీయస్థాయిలో నిష్ణాతులైన మహిళా జర్నలిస్టులు శిక్షణ ఇస్తారని వివరించారు. ఈ శిక్షణా తరగతులలో మొదటి రోజు ''మహిళా జర్నలిస్టులు - ప్రధాన స్రవంతి మీడియా - మహిళల పాత్ర'', అలాగే '' పాత్రికేయ రంగంలో మహిళలు - ప్రత్యేక సమస్యలు'' అనే అంశాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు. రెండవ రోజు ''మహిళా అస్తిత్వం - జెన్డర్ సెన్సీటైజేషన్ '' అనే అంశం, ''ఫీచర్ జర్నలిజం - మెళకువలు'' అంశాలపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నిష్ణాతులైన వారు శిక్షణ ఇవ్వనున్నారు.