Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డెక్కిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
- తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన దీక్షలు
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీ సోమవారం నిరసనకు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు రోడ్డెక్కారు. తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో, చౌటుప్పల్, నారాయణపురం మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా టీఆరఎస్ నాయకులు నిరసన దీక్షలు చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ నేతల దీక్ష శిబిరం ఎదుట బీజేపీ నాయకులు కూడా ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో మత్తు పదార్థాలు ఎక్కువైపోయాయని, వాటిని అరికట్టడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైనట్టు ఆరోపించారు. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.సూర్యాపేట, చివ్వెంల, పెన్‌పహాడ్ మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. మఠంపల్లి తహసీల్దార్ కార్యాలయ సముదాయ ప్రాంగణంలో మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తా వద్ద నిర్వహించిన నిరసనలో ఎమ్మెల్యే బొల్లంమల్లయ్యయాదవ్ పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలో కేంద్రం వైఖర్ని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అర్వపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే గాదరికిశోర్‌కుమార్ పాల్గొన్నారు.మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. కరీంనగర్ రూరల్ మండలంలోని దుర్శేడ్ గ్రామంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ, ఫౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ చౌరస్తాలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వర్యంలో ధరల పెంపుపై నిరసన చేపట్టారు.ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. రఘునాదపాలెం మండలం మంచుకొండలో మంత్రి పువ్వాడ అజరుకుమార్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనే వరకు బీజేపీని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఖమ్మం రూరల్ మండలం నాయుడు పేటలో చేపట్టిన దీక్షలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. నేలకొండపల్లిలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దీక్షలో కూర్చున్నారు. బోనకల్లో జెడ్పీ చైర్మెన్ లింగాల కమల్‌రాజ్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తహసీల్ధార్ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన నిరసనకు మంత్రి పువ్వాడ అజరుకుమార్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సంఘీభావం తెలిపారు.