Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రవ్యాప్త కాంగ్రెస్ నిరసనలు
నవతెలంగాణ-విలేకరులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు, కరెంట్, ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రి రాజేశ్, టీసీసీసీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ పాలడుగు అమరేందర్రెడ్డిల ఆధ్వర్యంలో కొర్రెముల గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్యర్యంలో ఎల్బీనగర్ జగ్జీవన్‌రావ్ కూడలిలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కూకట్ పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్లో ధర్నా చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మోడీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాప్రా సాయిరాం నగర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రంలో మోటకొండూరు, రాజాపేట, తుర్కపల్లి, భువనగిరి, ఆలేరులో, రామన్నపేటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేశారు. సూర్యాపేట జిల్లాలో మఠంపల్లి, పాలకవీడు, హుజూర్నగర్, చివ్వెంల మండలకేంద్రాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పెన్‌పహాడ్ మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. నల్లగొండ, మిర్యాలగూడ, దామరచర్లలో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపై రాస్తారోకో నిర్వహించారు. మిర్యాలగూడ, దామరచర్లలో డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు వెడ్మ బొజ్జు ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయినా పార్టీ కార్యకర్తలు వినకుండా రోడ్డుపై ధర్నా చేశారు. గుడిహత్నూర్‌లో కాంగ్రెస్ నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. జన్నారంలో రాస్తారోకో చేసి ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. తలమడుగులో జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. బేలలో ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కాటమోని తిరుపతమ్మ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రాల్లో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. కరెంట్ చార్జిలు తగ్గించాలని మండల విద్యుత్ ఏఈలకు వినతిపత్రాలు అందజేశారు.
ఖమ్మం జిల్లా వైరాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ పూలమాలలేసి నివాళి అర్పించారు. సత్తుపల్లిలో బోస్‌బొమ్మ సెంటర్లో రాస్తారోకో చేశారు. ముదిగొండలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. కల్లూరులో డీటీకి వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్నపురెడ్డిపల్లి, బూర్గంపాడు, ములకలపల్లిలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పాల్వంచలో సబ్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు.