Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కంఠేశ్వర్
తాగుడుకు బానిసైన కొడుకు కన్న తల్లినే కడతేడ్చాడు. ఈ హృదయవిదారక ఘటన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. తిరుమలపల్లి గ్రామానికి చెందిన గంగేశ్వర్ తరచూ మద్యం సేవించేవాడు. దీంతో భార్య అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. తాగడానికి డబ్బులు కావాలని, అదేవిధంగా తన భార్యను కాపురానికి తీసుకురావాలని గంగేశ్వర్ తల్లి అంజమ్మ (56)ను తరచూ వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వెళ్లి ఎప్పటిలాగే తల్లితో గొడవపడ్డాడు. రొట్టెల కోలతో అంజమ్మ చెవి భాగంలో గట్టిగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయమై అంజమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి మేనల్లుడు గైని మోహన్ ఫిర్యాదు ఎస్ఐ లింబాద్రి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.