Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మునుగోడు
పురుగుల మందు తాగి మహిళా కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చల్మెడ గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటి ముత్తమ్మ(40) గ్రామంలో పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేసింది. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల పంట దిగుబడి రాకపోవడంతో పెట్టుబడి కోసం చేసిన రూ.ఆరు లక్షల అప్పులు తీర్చలేకపోయింది. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. చుట్టుపక్కల వారు గమనించి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సతీష్ రెడ్డి తెలిపారు.