Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్యగౌడ్ బీజేపీలో చేరారు. మంగళవారం ఢిల్లీలో ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్, జాతీయ బీసీ కమిషన్ సభ్యులు టి.ఆచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పి.వి.శ్యామ్‌సుందర్, నాయకులు దాసరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.