Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేత మురళీధర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రంలో డ్రగ్స్వాడకం పెరిగిందనీ, డ్రగ్స్మాఫియా మూలాలతో టీఆర్ఎస్కు ప్రత్యక్ష సంబంధాలున్నాయని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి, సీనియర్ నేత మురళీధర్‌రావు ఆరోపించారు. మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై మోడీ ప్రభుత్వం వివక్ష చూపట్లేదన్నారు. ధాన్యం సేకరణ అంశంపై కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలందరూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారని విమర్శించారు. కుట్రపూరిత ఆలోచనతో ఢిల్లీ వర్సెస్ తెలంగాణ అనేదాన్ని తీసుకొచ్చి సెంటిమెంట్‌తో లబ్దిపొందాలని టీఆర్ఎస్ చూస్తున్నదన్నారు. కేసీఆర్ తరుచూ ఢిల్లీ వెళ్తే..తామూ ప్రతి ఊరికీ వెళ్లి టీఆర్ఎస్ తీరు ఎండగతామని చెప్పారు. పంజాబ్‌లో ప్రభుత్వం మారడానికి డ్రగ్ మాఫియానే కారణమన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ వాడితే కేసులు పెట్టాలన్నారు.