Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంవో కార్యదర్శి స్మీతాసభర్వాల్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో వేసవి నేపథ్యంలో ఎక్కడా తాగునీటి సరాఫరాలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి కార్యదర్శి, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆదేశించారు. నీటి నాణ్యత, పరిమాణం విషయంలో రాజీపడొద్దని చెప్పారు. తెలంగాణ ప్రజలకు తాగునీటి కష్టం తలెత్తరాదన్న ప్రభుత్వ సంకల్పాన్ని చిత్తశుద్దితో కొనసాగించాని సూచించారు. వేసవి తాగునీటి సరాఫరాపై హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో ఉన్న మిషన్ భగీరథ ప్రధానకార్యాలయంలో అన్ని జిల్లాల ఎస్.ఈ లు , ఈఈలతో మంగళవారం స్మితా సభర్వాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వేసవిలో నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరుగవచ్చన్న అంచనాల నేపథ్యంలో తాగునీటి సరాఫరాలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామపంచాయితీల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ నీటి సరాఫరాను కొనసాగించాలని చెప్పారు. రిజర్వాయర్లలోని నీటి మట్టాన్నీ సైతం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని అధికారులకు సూచించారు.చీఫ్ ఇంజినీర్లు కింది స్థాయి సిబ్బందితో ప్రతిరోజూ మాట్లాడాలనీ, తాగునీటి సరఫరాలో మిషన్ భగీరథ శాఖకు దేశంలోనే మంచి పేరు ఉందంటూ దాన్ని నిలబెట్టుకునేలా అందరూ పనిచేయాలన్నారు. ఈ వీడియా కాన్ఫరెన్స్ లో ఇంజినీర్ ఇన్ చీఫ్ కపాకర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజినీర్లు విజరు ప్రకాశ్, వినోభాదేవి, శ్రీనివాస్ రావు, చిన్నారెడ్డి, జ్ఞానకుమార్, లలిత, కన్సల్టెంట్లు నర్సింగరావు, జగన్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.