Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు గంజాయి, హాష్ అయిల్ సప్లరు
- మృతిచెందిన యువకుని కేసులో సూత్రధారి
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో మాదక ద్రవ్యాలకు బానిసైన యువకుడు మృతిచెందిన ఘటనలో కీలక నిందితుడు లక్ష్మీపతిని నార్కోటిక్ వింగ్ పోలీసులు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. నల్లకుంటలో బీటెక్ విద్యార్థి మృతి కేసులో కీలక సూత్రధారిగా లక్ష్మీపతి ఉన్నాడు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ మొదలు పెటారు. ఈ క్రమంలో యువకుడు గోవా వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇంజినీరింగ్ చదివే సమయంలో స్నేహితులతో కలిసి మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డాడని తేల్చారు. డ్రగ్స్‌కు బానిసైన యువకుడు ఎల్ఎస్డీ, కొకైన్, హాష్, ఎండీఎంఏ ఇలా పలు రకాల డ్రగ్స్ వినియోగించాడు. ఓవర్ డోస్‌తో కోమాలోకి వెళ్లాడు. నరాలు వీక్ అయ్యి లేవలేని స్థితికి చేరాడు. దాంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ మృతిచెందిన విషయం విదితమే. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని డ్రగ్స్ సరఫరాలో కీలక సూత్రధారి లక్ష్మీపతిగా గుర్తించారు. లక్ష్మీపతి హైదరాబాద్‌లో పలువురికి హాష్ ఆయిల్ సరఫరా చేసేవాడని విచారణలో తేలింది. ఏడేండ్లుగా గంజాయికి బానిసైన లక్ష్మీపతి చదువుకునే రోజుల్లోనే గంజాయి, డ్రగ్స్ అమ్మేవాడని గుర్తించారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి లక్ష రూపాయలకు లీటర్ హాష్ ఆయిల్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో లీటర్ రూ.8 లక్షలకు అమ్మేవాడని తేల్చారు. ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తితో కలిసి లక్ష్మీపతి డ్రగ్స్ అమ్మకాలు కొనసాగించాడు. అంతేకాకుండా, గోవా నుంచి నగరానికి డ్రగ్స్ తీసుకొచ్చి విద్యార్థులకు సరఫరా చేసేవాడు. యువకుని మృతి తర్వాత లక్ష్మీపతి కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి తీవ్రంగా గాలించిన పోలీసులు నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టు చేశారు.