Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిమ్స్ నర్సులు ఆందోళన విరమించాలి
- ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటాం
- రాష్ట్ర సర్కారు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
''గత నెల 28 న నర్సుల సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే మంత్రి హరీశ్‌రావు సకాలంలో స్పందించారు. సమస్య పరిష్కరించాలని హెల్త్ సెక్రెటరీని ఆదేశించారు. హెల్త్ సెక్రెటరీ, నిమ్స్ యాజమాన్యంతో కలిసి నర్సులతో అదే రోజు పలు దఫాలుగా చర్చలు జరిపారు. చర్చించిన వెంటనే వారడిగిన ఎన్‌హెచ్ ఎం కాంట్రాక్టు నర్సులతో సమానంగా 30 శాతం వేతనం పెంపు, పే స్లిప్స్, వెయిటేజీ, ఎరియర్స్, రెగ్యులర్ రిక్రూట్మెంట్ లో కూడా అవకాశం ఇవ్వడం కల్పించడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టు నర్స్ లకు ఎటువంటి మెటర్నిటీ లీవ్ బెనిఫిట్ ఉంటుందో దానినినే నిమ్స్ కాంట్రక్టు నర్స్ లకు వర్తిప చేయడం జరిగింది. ముఖ్యమైన డిమాండ్లపై 24 గంటల్లో సానుకూల ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కాని నర్సులు మాట మార్చి రెగ్యులరైజ్ చేయాలనీ, ఇంకా వేతనం పెంచాలని మొండికేసి ఆందోళన లో పాల్గొంటున్నారు. నిమ్స్ యాజమాన్యం, లేబర్ కమిషన్ అధికారులు రోజువారీగా నర్సులతో మాట్లాడారు. విధుల్లో చేరాలని కోరారు. అయినా ఆందోళన విరమించలేదు. ఈ నేపథ్యంలో మంత్రి మరోసారి సమీక్షించినట్టు ... '' రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. నిమ్స్‌లో ఆందోళన చేస్తున్న నర్సులు తక్షణం ఆందోళన విరమించి, విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మంగళవారం హైదరాబాద్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, కార్మిక శాఖ కమిషనర్‌తో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నర్సుల ఆందోళపై చర్చించారు.
''నర్సులను 2010 లో స్టూడెంట్ ఇంటర్న్‌లుగా తీసుకోవడం, అప్పుడు వారికి రూ. ఎనిమిది వేలు మాత్రమే ఇచ్చే వారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నాలుగు రెట్లు పెంచి రూ.32 వేలు చేశారు. వారి సర్వీస్ ను స్టాఫ్ నర్స్ కాంట్రాక్టు సర్వీస్ గా గుర్తించి రెగ్యులర్ నియామకాలలో వెయిటేజీ కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా 80 మంది రెగ్యులర్ పద్దతిలో ఉద్యోగం పొందడం జరిగింది. ఇప్పుడున్న వారిని కూడా దశల వారీగా తీసుకోవడం జరిగింది. చాల మంది రెగ్యులర్ జాబ్‌లు లేదా ఇతర అవకాశం వచ్చిన తరువాత వదిలి వెళ్లడం జరిగింది. ఎక్కువ మంది ఈ మధ్య కరోనా కాలంలోనే నియమించబడ్డారు( 300 మంది పైగా). అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన తర్వాత కూడా ఇంకా ఆందోళనలో పాల్గొని పేషెంట్ సేవలకు అంతరాయం కల్పించడం మంచిది కాదు. ఎలాంటి పరీక్ష లేకుండా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా, ఆరు నెలల కాలానికి విధుల్లో చేరిన నర్సులు రెగ్యులరైజ్ చేయాలని కోరడం నిబంధనలకు లోబడి లేదు. ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా ఆందోళన విరమించాలని కోరుతున్నప్పటికీ నర్సులు లెక్క చేయడం లేదు. రోగులకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు వస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి కలిగించకుండా విధుల్లో చేరాలని ప్రభుత్వం కోరుతున్నదని'' తెలిపారు.