Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ రహదారి సర్వేను అడ్డుకున్న రైతులు
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
నాగపూర్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి సర్వేను ఖమ్మం జిల్లా రూరల్ మండలం మంగళగూడెంలో రైతులు, రైతు సంఘం నాయకులు మంగళవారం అడ్డుకున్నారు. తమకు ఎటువంటి సమాచారమూ ఇవ్వకుండా తమ భూమిలో సర్వే చేయడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. ఈ జాతీయ రహదారి వల్ల తమకు నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధర ప్రకారమే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు ఇష్టం లేకుండా పంట భూముల్లో సర్వే చేయడానికి వీలులేదని తేల్చి చెప్పారు. దాంతో త్వరలోనే గ్రామ సభ నిర్వహిస్తామని, అందులో రైతుల అభిప్రాయాలు, డిమాండ్లను తెలియజేయాలని తహసీల్దార్ సుమ రైతులు, రైతు నాయకులకు సూచించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు ప్రతాపనేని మెకటేశ్వర్లు, తక్కెళ్లపాడు భద్రయ్య, సుధీర్, రైతులు వీరెల్లి ప్రసాద్, వెంకయ్య, బొజేడ్ల వెంకటయ్య, కందుల రామయ్య, ఉపేందర్, శ్రీధర్, నాదెండ్ల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.