Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంజీఎం వైద్యుల వినూత్న నిరసన
నవతెలంగాణ-మట్టెవాడ
ప్రభుత్వ వైద్యులను వైద్యం మానేసి ఆస్పత్రిలోని ఎలుకలను పట్టుకోమంటారా.. అని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజమోహన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు కొరికిన ఘటనలో వైద్యులను బాధ్యులను చేస్తూ శిక్షించడం అన్యాయమని టీజీడీఏ కేఎంసీ ఆధ్వర్యంలో వైద్యులు మంగళవారం విధులు బహిష్కరించి ఆస్పత్రి ప్రధాన గేటు ఎదుట ఎలుకల బోనులతో వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఎలుకలు ఆస్పత్రి వార్డులో దూరడానికి వైద్యులకు సంబంధం ఏమైనా ఉంటుందా.. ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత శానిటేషన్పై ఉంటుందని అన్నారు. ఎంజీఎంలో శానిటేషన్ చూస్తున్న ప్రయివేటు కాంట్రాక్టు సంస్థను వదిలేసి వైద్యులను బాధ్యులను చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రయివేటు ఆస్పత్రులు, ప్రయివేటు వైద్యులు భయంతో వైద్యం చేయడానికి ముందుకు రాకపో యినా ప్రాణాలను పణంగా పెట్టి ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు వైద్యసేవలందించారని గుర్తుచేశారు. అలాంటి వైద్యులను సంబంధంలేని విషయంలో బలితీ సుకోవడం సరికాదన్నారు. సమస్యకు కారణమైన ప్రయివేటు కాంట్రాక్టు శానిటేషన్పై చర్యలు తీసు కోవాలని, వైద్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పూర్తిగా వైద్య సేవలు బహిష్కరిం చడానికి కూడా వెనకాడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు హరిదేవ్, డాక్టర్ కవిత, పవన్, కరుణాకర్, నాగార్జునరెడ్డి, శ్రీధరరావు, బింగి శ్రీనివాస్, చంద్రశేఖర్, అన్వర్ మియ, తదితరులు పాల్గొన్నారు.