Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
- హక్కులు, బాధ్యతలు యూటీఎఫ్ నేత్రాలు: రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య
నవతెలంగాణ -నల్లగొండ
అన్ని మేనేజ్ మెంట్స్‌లో పనిచేస్తున్న గురుకుల ఉపాధ్యా యులు సంఘటితంగా పోరాడితే తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీఎస్ యూటీఎఫ్ ముద్రాంకిత భవనంలో గురుకుల ఉపాధ్యాయుల సదస్సు నిర్వహించారు. బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గురుకుల సమస్యలపై పోరాటానికి మద్దతుగా ఉంటానని తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె.జంగయ్య మాట్లాడుతూ.. హక్కులు, బాధ్యతలు రెండు నేత్రాలుగా పనిచేస్తున్న సంఘం యూటీఎఫ్ అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతుందన్నారు. దాంట్లో భాగంగానే పీఆర్సీ సాధించినట్టు తెలిపారు. గురుకుల పాఠశాలల ఇన్చార్జి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా అన్ని మేనేజ్మెంట్లో గురుకుల ఉపాధ్యాయుల సదస్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల ఉపాధ్యాయులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సమస్యల కోసం పరిష్కారానికి పోరాటానికి సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్ రెడ్డి, జి.నాగమణి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ళ వెంకటేశం, గురుకుల పాఠశాలల రాష్ట్ర కన్వీనర్లు సృజన, ఎల్లయ్య, నరేష్, రాంబాబు, శ్రీనివా, జిల్లా కోశాధికారి శేఖర్ రెడ్డి, కార్యదర్శులు నరసింహా, ఆర్.రమాదేవి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎస్.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.