Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆ విభాగంలో పని చేసే సిబ్బంది ఇతర విభాగాల్లో సిబ్బంది మాదిరిగానే పనులు చేస్తారు. అయినప్పటికీ మిగిలిన విభాగాల్లో ఉన్న సిబ్బందికి ఉన్న సౌకర్యాలు మాత్రం వారికి వర్తించవు. ఒకే రకమైన పని చేస్తున్నప్పటికీ ఒకే రకమైన సౌకర్యాలకు నోచుకోవడం లేదు. దీంతో ఏండ్ల తరబడి ఆ సౌకర్యాల కోసం అడుగుతూనే ఉన్నారు. ఉన్నతాధికారులు మొదలుకొని ప్రజా ప్రతినిధులు, మంత్రులకు వినతిపత్రాలు సమర్పించుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. తోటి విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు జోన్ల వారీగా విభజన జరుగుతుంటే తమకెప్పుడు ఆ అవకాశం వస్తుందని ఎదురు చూస్తూ ఉండిపోతున్నారు. సౌకర్యాల విషయంలో రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మధ్య సౌకర్యాల్లో తేడానే ఎక్కువగా బయటి ప్రపంచానికి తెలుసు. కానీ వైద్యారోగ్యశాఖలో ప్రధానంగా మూడు విభాగాలుండగా అందులో వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల పరిస్థితి మాత్రం దయనీయంగా తయారైంది. ఇంతకాలం వీవీపీకి ఇన్ఛార్జీ కమిషనర్‌గా ఉన్న డాక్టర్ కె.రమేశ్ రెడ్డి ఉండగా ఆయన స్థానంలో డాక్టర్ అజరు కుమార్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించడంతో ఇప్పటికైనా సమస్యలు పరిష్కారమవుతాయని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
హెల్త్ కార్డులు అందేనా?
అసెంబ్లీలో ప్రత్యేక చట్టం ద్వారా వైద్యవిధాన పరిషత్‌ను ఏర్పాటు చేశారు. అటానమస్‌గా ఏర్పడిన ఈ విభాగంలో పని చేసే రెగ్యులర్ ఉద్యోగులు హెల్త్ కార్డులకు నోచుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇతర సౌకర్యాలు కల్పించాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వచ్చింది. తెలంగాణ వస్తే హెల్త్ కార్డులిస్తామని హామీని ఇచ్చింది. రాష్ట్రం సిద్ధించింది. అయినా ఉద్యోగులు హెల్త్ కార్డులు ఇవ్వలేదు. దీంతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికిగురైన సందర్భంలో వైద్య ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
పెండింగ్‌లో పదోన్నతులు....
రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు....జోన్ల వారీగా ఉద్యోగుల విభజన మిగిలిన విభాగాల్లో జరిగినా వీవీపీలో మాత్రం మొదలు కాలేదు. ఏండ్ల తరబడి సాధారణ బదిలీలు లేక, జోన్ల వారీ విభజన కూడా చేపట్టకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు పదోన్నతుల సమస్య దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నది. కోర్టు కేసు చేపడతారని భావించినప్పటికీ అలా జరగకపోయే సరికి ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొన్నది. వైద్య విధాన పరిషత్ పరిధిలో ఆరు జిల్లా ఆస్పత్రులు, 83 ఏరియా ఆస్పత్రులు, ఆరు మాతా, శిశు సంరక్షణ ఆస్పత్రులు, ఏడు అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 52 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లున్నాయి. ఈ విభాగంలో దాదాపు 12,000 మంది వరకు వైద్య, నర్సింగ్, పారామెడికల్, ఇతర సిబ్బంది పని చేస్తుండగా, ఇందులో దాదాపు సగం మంది నర్సులే ఉన్నారు. స్టాఫ్ నర్సులు ఏండ్ల తరబడి పదోన్నతులు లేకపోవడంతో ఉన్న కేడర్లోనే సరిపెట్టుకోవాల్సి వస్తున్నది. 1998 బ్యాచ్ కు చెందిన వారికి 2019 నవంబర్‌లో పదోన్నతులు కల్పించారు. 1999 బ్యాచ్‌కు సంబంధించిన వారికి ప్రమోషన్ల ప్రక్రియను సగంలో నిలిపేశారు. వీరిలో 72 మంది మిగిలిపోయారు. కాగా సీనియార్టీ జాబితాపై కోర్టులో కేసు రాగా అది క్లియర్ అయ్యేంత వరకు ప్రమోషన్లు కల్పించలేకపోయారు. ప్రస్తుతం కోర్టు కేసు ముగిసినప్పటికీ పదోన్నతులు చేపట్టకపోవడంతో ప్రమోషన్లకు అర్హత కలిగిన స్టాఫ్ నర్సులు ఆందోళన చెందుతున్నారు.పదోన్నతుల ప్రక్రియ చేపట్టిన తర్వాతే సాధారణ బదిలీలు, జోన్ల విభజన చేపడితే బాగుంటుందని విన్నవించుకుంటున్నారు.
నర్సులకు అన్యాయమే...
తెలంగాణ ఏర్పాటుకు ముందు నర్సుల నియామకాన్ని తెలంగాణలో హైదరాబాద్,వరంగల్ రెండు రీజినల్ డైరెక్టరే ట్ల పరిధిలో జరిగేవి.ప్రస్తుతం రీజినల్ డైరెక్టరేట్లను తొలగిం చి డీహెచ్ పరిధిలోనర్సింగ్ ఇన్ఛార్జీ ఈ వ్యవహారాలను చూస్తున్నారు.రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో నర్సులుగా నియమి తులై వైద్య విధాన పరిషత్‌లో విధులు నిర్వహిస్తున్న వారి వివరాలను నర్సింగ్ ఇన్ఛార్జీ వీవీపీకి పంపించాల్సి ఉంటుం ది.పదోన్నతులు కల్పించేందుకు ఈ వివరాలు పంపించాలని గతంలోనే వైద్య విధాన పరిషత్ ఇన్ఛార్జీ కమిషనర్ డీహెచ్ పరిధిలో నర్సుల సర్వీసులకు సంబంధించిన వ్యవహారాలను చూసే బాధ్యులను కోరినట్టు సమాచారం.అయితే ఏడాది గడుస్తున్నప్పటికీ ఆ వివరాలు రాకపోవడమే పదోన్నతుల కల్పనకు అడ్డంకిగా మారినట్టు తెలుస్తున్నది.
మంత్రి హరీశ్ రావుపై ఎన్నో ఆశలు....
పదోన్నతుల కోసం ఆయా జిల్లాల నుంచి నర్సులు పదే పదే హైదరాబాద్‌కు రావడం ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకుంటున్నారు.ఎన్నిసార్లు కోరినప్పటికీ ఉన్నతాది óకారుల నుంచి మాత్రం సమస్యలు పేరుకుపోవడానికి సరైన కారణాలు మాత్రం సమాధానం రావడం లేదని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని జిల్లాల నుంచి నర్సులు నేరుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించి వెళ్లారు. ఒకవైపు ప్రజల ఆరోగ్యానికి సంబంధిం చి కీలకమైన రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఉద్యోగులకు సమయానికి రావాల్సిన సౌకర్యాలు రాకపోవడంతో అసంతృప్తికి గురవుతున్నారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.