Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయనో సామాజిక విప్లవ కారుడు: మంత్రి కొప్పుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సామాజిక విప్లవ కారుడు బాబూ జగ్జీవన్‌రామ్ అని ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం హైదరా బాద్‌లోని నిజాం కాలేజి సమీపంలోని జగ్జవన్రామ్ విగ్రహం వద్ద ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, బాబాసాహెబ్ అంబేడ్కర్ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల కమిటీ 115వ జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్బంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి, చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోమ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతోపాటు వివిధ కార్పొరేషన్ల ఛైర్మెన్లు, అధికారులు పాల్గొన్నారు.