Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఈనాందారుల వారసత్వ హక్కుల వివాదంపై రెండు విరుద్ధమైన తీర్పులు వెలువడిన రీత్యా వాటిలో ఏది చట్టబద్ధత ఉన్నదో తేల్చేందుకు హైకోర్టు ఫుల్ బెంచ్ బుధవారం విచారణ ప్రారంభించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ పి.శ్రీసుధలతో కూడిన ఫుల్ బెంచ్ విచారణ చేపట్టింది. ఒక డివిజన్ బెంచ్.. ఇనాందార్ల వారసులకు ఓఆర్సీ వర్తిస్తుందని తేల్చింది. మరో డివిజన్ బెంచ్.. ఈనాందారుల వారసుల నుంచి భూమి కొనుగోలు చేసిన వారూ వారసులేనని తేల్చింది. ఈ నేపథ్యంలో ఏ తీర్పుకు చట్టబద్ధత ఉంటుందో ఫుల్ కోర్టు తేల్చనుంది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.