Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని 234 సర్వే నెంబర్లోని 84 ఎకరాల ల్యాండ్ విషయంలో పిటిషనర్‌కు హక్కు లేదని హైకోర్టు 4 ఏళ్ల క్రితమే తేల్చిందని, పిటిషనర్ సుప్రీంకోర్టుకు వెళ్లి ఓడిపోయాడని, ఇప్పుడే అదే పిటిషనర్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం చెల్లదని రాష్ట్రం వాదించింది. లింగయ్య అనే వ్యక్తి భూమిపై హక్కు కోసం రివ్యూ పిటిషన్ వేయడం, ఆ భూమిలో 5 ఎకరాలు తనదంటూ బి.శివరామకష్ణ రిట్ వేయడం చెల్లదని వాదించింది. విచారణను గురువారం కొనసాగిస్తామని న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ ప్రియదర్శినిలతో కూడిన డివిజన్ బెంచ్ వెల్లడించింది.