Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తాను ఎలాంటి క్షుద్రపూజల్లో పాల్గొనలేదని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు స్పష్టతనిచ్చారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను ఓర్వలేకనే కొందరు నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొంటే తప్పేందముందని ప్రశ్నించారు. స్థానికుల ఆహ్వానం తోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో జరిగిన పూజ కార్యక్రమానికి వెళ్లినట్టు చెప్పారు. స్వయం ప్రకటిత దేవతతో సంబంధం లేదనీ, మూఢ నమ్మకాలను అసలే విశ్వసించనని తెలిపారు. రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్గా ఉన్న తనకు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరమేమున్నదని ప్రశ్నించారు. ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్లు చేయించినట్టు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజా ప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని ఆయన కోరారు.